సుడిగాడు
సుడిగాడు - 2012 కామెడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, మోనల్ గజ్జర్, చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణు మాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు. నిర్మాత డి చంద్రశేకర్, ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీవసంత్. సీమలో కామేష్ , హేమ దంపతులకు సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ ఫుల్ గా పుట్టిన బిడ్డ శివ. పుట్టగానే వాడిపై పగ పెచ్చుకున్న తిక్కలరెడ్డి ఆ పసి పిల్లాడ్ని పొత్తిళ్లలోనే చంపాయాలనుకుంటాడు. ఆ ప్రమాదం నుంచి కాపాడి ,భావి తెలుగు హీరోని బ్రతికించటానికి కామేష్ తన తల్లి కి ఇచ్చి తప్పించి హైదరాబాద్ పంపేస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ రాజధాని హైదరాబాద్ వచ్చిన శివ స్టార్ హీరోలకే సొంతమైన బుల్లెట్స్ కు ఎదురెళ్లటం, కాలాన్ని శాసించటం వంటి అద్బుత లక్షణాలతో పెరిగి పెద్దవుతాడు. ఓ ప్రక్క తన తెలివితేటలతో మాఫియాని ఎదుర్కొంటూ, ప్రియతో ప్రేమలో పడతాడు. అనితర సాధ్యమైన ఆమె ప్రేమను ఎలా పొందాడు.. చిన్నప్పుడే విడిపోయిన తన తల్లి తండ్రులను ఎలా కలిసాడు... పనిలో పనిగా తన భాధ్యత అయిన దేశాన్ని రక్షించటం అనే కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేది మిగతా కథ.
Details About సుడిగాడు Movie:
Movie Released Date | 24 Aug 2012 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Sudigadu:
1. Total Movie Duration: 2h 12m
2. Audio Language: Telugu